News April 1, 2025
విధుల్లో అలసత్వం వహించరాదు: కలెక్టర్

గ్రామ సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహించరాదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది స్నేహపూరితమైన వాతావరణంలో మెలగాలని అన్నారు. సమయపాలన పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 10, 2025
జూలకల్లులో వైసీపీ నేతపై దాడి

ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని జూలకల్లులో వైసీపీ నేత పాశం చిన్న అంజిరెడ్డిపై గురువారం కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆయన్ని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
News April 10, 2025
GNT: సోషల్ మీడియా దుర్వినియోగానికి గట్టి హెచ్చరిక

చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను TDP ఆయనను తక్షణమే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా పార్టీ నైతిక ప్రమాణాలను ప్రదర్శించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఆచరణా నియమాలను ఉల్లంఘించే వారికి హెచ్చరికగా నిలిచింది. పార్టీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. CM చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని పలువురు అంటున్నారు.
News April 10, 2025
డాక్టర్ ప్రభావతి వ్యాఖ్యలపై RRR స్పందన

కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి తనకేమీ గుర్తులేదని చెప్పడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ చదివిన వైద్యురాలు గాయాలపై అవగాహన లేదనడం ఆశ్చర్యకరమని అన్నారు. ఆమెకు గతం గుర్తొచ్చే ఏర్పాట్లు జరుగుతాయని ఆశిస్తున్నానన్నారు. కొన్ని సినిమాల్లోలా, ఆమెకి మళ్లీ జ్ఞాపకశక్తి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.