News January 31, 2025

విధుల్లో ప్రజల మన్ననలు పొందాలి: భద్రాద్రి ఎస్పీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సాయుధ బలగాల డీ మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు.15 రోజుల పాటు జిల్లా ఆర్మ్డ్ రిజర్వుడ్ సిబ్బంది ఇండోర్, ఔట్ డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ.. క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేసేవలు అందించి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News October 28, 2025

అత్యవసర సమయాల్లో ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

image

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజల రక్షణకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 24×7 కమాండ్ కంట్రోల్ రూమ్ (8333813228) ఏర్పాటు చేశామన్నారు. చీరాల సబ్‌డివిజన్ – ఎస్‌ఐ వి.నాగ శ్రీను (9121104793), బాపట్ల ఎస్‌ఐ ఎం.విజయ్ కుమార్ (8978777298), రేపల్లె సీసీ డీఎస్పీ పి.రవి ప్రసాద్ (9032030919) ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు.

News October 28, 2025

వట్టిచెరుకూరులో భారీ వర్షపాతం నమోదు

image

‘మొంథా’ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వట్టిచెరుకూరు మండలంలో 19.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రైతులు తమ పంటలకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News October 28, 2025

వనపర్తి: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శిథిలావస్థ భవనాలలో నివాసం ఉండరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. సహాయం కోసం ‘డయల్ 100’కు ఫోన్ చేయాలని సూచించారు.