News January 31, 2025
విధుల్లో ప్రజల మన్ననలు పొందాలి: భద్రాద్రి ఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సాయుధ బలగాల డీ మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు.15 రోజుల పాటు జిల్లా ఆర్మ్డ్ రిజర్వుడ్ సిబ్బంది ఇండోర్, ఔట్ డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ.. క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేసేవలు అందించి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News February 14, 2025
ఖండాలు దాటిన ప్రేమ.. నల్గొండ అబ్బాయి.. అమెరికా అమ్మాయి

ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. NLG(D) దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదే కంపెనీలో మేజేజర్‌గా పనిచేస్తున్న అమెరికా యువతి అవని ఏలేనాతో ప్రేమలోపడ్డాడు. ఈనెల 7న ఘట్కేసర్‌లో వీరి వివాహ జరిగింది.
News February 14, 2025
మంత్రి గన్‌మెన్ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఎస్పీ

రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న జి.వెంకటరమణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇటీవల సాలూరు నుంచి విజయనగరం వస్తుండగా బుల్లెట్ మ్యాగ్జైన్‌తో ఉన్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో ఆయన విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 14, 2025
సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ పడవలో గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.