News February 16, 2025
విధుల నుంచి చోద్యం పీఈటీ తొలగింపు

గొలుగొండ మండలం చోద్యం జడ్పీ హైస్కూల్ పార్ట్‌టైమ్ పీఈటీ కుందూరు నూకరాజును అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు డీఈవో జి.అప్పారావు నాయుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినులపై నూకరాజు అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కావడంతో అధికారులు వేటు వేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Similar News
News March 27, 2025
నటి రన్యా రావుకు షాక్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో రన్యా రావుకు సహకరించిన సాహిల్ జైన్‌ను తాజాగా డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.
News March 27, 2025
రాష్ట్రం దివాలా తీసింది అనడానికి ఆధారాల్లేవు: కేటీఆర్

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పులకు తగినట్లే సంపద పెరిగిందని అసెంబ్లీలో చెప్పారు. అప్పులు లేని వ్యక్తి, దేశం ఉండదని అన్నారు. అమెరికాలాంటి దేశాలు కూడా అప్పులు చేశాయన్నారు. రాష్ట్ర ఏర్పడిన రోజు సగటు ఆదాయం రూ.3,500 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.18వేల కోట్లు ఉందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని అనడానికి ఆధారాలు లేవని చెప్పారు.
News March 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎకలవ్య అధ్యక్షుడిగా కోనేటి సాయి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏకలవ్య అధ్యక్షుడిగా కొనేటి సాయిలు ఎన్నికయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కోనేటి సాయిలును ఏకలవ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం సాయిలు మాట్లాడుతూ.. ఏకలవ్య ఎరుకల కుల సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు.