News April 10, 2024

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ మనజీర్ జిలాని సమూన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని తహాశీల్దార్ కార్యాలయంతో పాటుగా గొబ్బూరు గ్రామ పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో ఓటింగ్‌ శాతం పెరిగే విధంగా ఓటర్లను చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలన్నారు.

Similar News

News November 24, 2025

ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియో‌ఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.

News November 24, 2025

ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.