News May 24, 2024
విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన కానిస్టేబుల్ వీఆర్‌కు

లేపాక్షి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న చెన్నకేశవ అనే కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీచేసినట్లు డీఎస్పీ కంజక్షన్ తెలిపారు. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ప్రొటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల సదరు కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు అందాయని వాటిని దృష్టిలో పెట్టుకుని వీఆర్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
టీడీపీలో చేరి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెకు ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు నియామక పత్రం అందజేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి.. బుధవారం టీడీపీలో చేరారు. 24 మంది కౌన్సిలర్లకు గాను 22 మంది హాజరయ్యారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులిద్దరితో కలిపి 13 మంది గౌతమికి ఓటు వేయడంతో గెలుపొందారు.
News December 11, 2025
BREAKING: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గౌతమి

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తతలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News December 11, 2025
అనంతపురం కలెక్టర్‌కు 22వ ర్యాంకు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 22వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 930 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 863 ఫైల్స్ క్లియర్ చేశారు. ఈయన ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 5 రోజుల 22 గంటల సమయం తీసుకున్నారు.


