News January 24, 2025

వినతులను త్వరితగతిన పరిష్కరించాలి: ఆదోని సబ్ కలెక్టర్

image

గోనెగండ్ల గ్రామంలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో తహశీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.

Similar News

News December 7, 2025

నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

image

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్‌కుమార్‌(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 7, 2025

కర్నూలు: ‘స్క్రబ్ టైఫస్.. వ్యాధి కాదు’

image

స్క్రబ్ టైఫస్ వ్యాధి కాదని, మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై వైద్య బృందంతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని, 39 మంది రోగులను డిశ్చార్జ్ చేశామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు వివరించారు.

News December 7, 2025

ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

image

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.