News March 12, 2025

వినయ్ చంద్‌కు అన్నమయ్య జిల్లా బాధ్యతలు

image

అన్నమయ్య జిల్లా ప్రత్యేకాధికారిగా వాడ్రేవు వినయ్ చంద్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు. మరోవైపు కడప జిల్లా ప్రత్యేక అధికారిగా సౌరభ్ గౌర్ నియమితులయ్యారు.

Similar News

News February 15, 2026

గద్వాల: మున్సిపల్ ఎన్నికలకు మూడంచెల భద్రత

image

గద్వాల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు మూడంచెల భద్రతతో పాటు 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల అనంతరం ర్యాలీలు, డీజేలు నిర్వహించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News February 15, 2026

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.08581 VSKP- SMVB రైలు మార్చి 1 నుంచి 29 వరకు ప్రతి ఆదివారం, నం.08582 SMVB- VSKP మధ్య నడిచే రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఆదివారం ప్రకటించారు.

News February 15, 2026

నెల్లూరు: శివరాత్రి జాగరణ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

image

మహా శివరాత్రి సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్థులు ఉపవాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు, పండ్ల రసాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. రాత్రి వేళ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రమత్తులో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.