News September 3, 2024

‘వినాయక చవితి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి’

image

ఈనెల 7న వినాయక చవితి పండుగను ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. మంటపాలలో అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలని, ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలని, మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని ఎస్పీ అన్నారు.

Similar News

News November 25, 2025

ప్రకాశం జిల్లా గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు.!

image

ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ జయ పార్ట్‌టైం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. చీమకుర్తి బాలికల గురుకులాల్లో JL బోటనీ, మార్కాపురం బాలికల గురుకులాల్లో JL మ్యాథమెటిక్స్, కొండేపిలో TGT ఫిజికల్ సైన్స్ విభాగాలకు దరఖాస్తులు అందుకుంటున్నారు. డిసెంబర్ ఒకటిలోగా చీమకుర్తి గురుకులంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. 2వతేదీ 11 AMకి చీమకుర్తి గురుకులంలో డెమో క్లాస్ ఉంటుందన్నారు.

News November 25, 2025

ప్రకాశం SP మీకోసంకు 63 ఫిర్యాదులు.!

image

ఒంగోలు SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన SP మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వర ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ DSP రమణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు.

News November 24, 2025

ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.