News August 29, 2024
వినాయక చవితి వేడుకల అనుమతులపై హోంమంత్రి సమీక్ష

వినాయక చవితి ఉత్సవాల అనుమతిపై గురువారం హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. మొబైల్ నుంచి https://ganeshutsav.net/ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చునని వివరించారు. శుక్రవారం నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని, ఉత్సవాలకు సంబంధించి వివరాలు పెట్టిన తరువాత అన్ని విభాగాల అధికారులు పరిశీలిస్తారన్నారు.
Similar News
News December 10, 2025
కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర శోభ

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీచక్రనవావర్ణార్చన, లక్ష్మీహోమం జరిగాయి. గురువారంభక్తుల రద్దీ దృష్ట్యా పూజా సమయాలను కుదించినట్లు ఈవో తెలిపారు. భక్తులు ఆన్‌లైన్, వాట్సాప్ (9552300009) ద్వారా దర్శనం, ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశామని, వీఐపీలు, వృద్ధులు నిర్ణీత సమయాల్లోనే రావాలని కోరారు.
News December 10, 2025
ఏయూలో డిసెంబర్ 15 నుంచి ‘సరస్’ ఎగ్జిబిషన్: కలెక్టర్

మహిళల స్వయం సాధికారత కోసం డిసెంబర్ 15 నుంచి 26 వరకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ‘సరస్’ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. దేశవ్యాప్తంగా 600 మంది డ్వాక్రా మహిళలు 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హ్యాండ్‌లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ ప్రదర్శనను ఆదరించాలని కలెక్టర్ కోరారు.
News December 10, 2025
పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: విశాఖ కలెక్టర్

విశాఖ జిల్లాలో పేదల గృహ నిర్మాణాలను వేగవంతం చేసి, మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో, రోజుకు 200 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. గడువులోగా పూర్తి చేయకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు అవుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


