News September 6, 2024

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా

image

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భక్తులు వినాయకుడిని పూజిస్తారని మంత్రి సురేఖ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యేడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు.

Similar News

News October 8, 2024

వరంగల్ మార్కెట్‌కు వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News October 8, 2024

మహాకాళి అవతారంలో గంభీరంగా దర్శనమిస్తున్న అమ్మవారు

image

వరంగల్ నగరవ్యాప్తంగా శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల ఏర్పాటుచేసిన దుర్గాదేవి ప్రతిమలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ బట్టల బజార్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు భక్తులు తరలివస్తున్నారు. మహాకాళి అవతారంలో గంభీరంగా కనిపిస్తున్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.

News October 8, 2024

వరంగల్: పతనమవుతున్న మొక్కజొన్న ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 40 రోజుల క్రితం వరకు మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు ధరలు నమోదు చేసిన మొక్కజొన్న.. గత కొద్దిరోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతంలో రూ.3వేలకు పైగా పలికిన క్వింటా మక్కలు(బిల్టి) ధర క్రమంగా పతనమై వస్తూ నేడు రూ.2430కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు.