News September 7, 2024
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

వినాయక చవితి పండుగ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని డిప్యూటీ సీఎం అన్నారు.
Similar News
News December 29, 2025
ఖమ్మం: ’34 ఏళ్ల తరువాత కలుసుకున్నారు’

కామేపల్లి మండలం కొమ్మినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగింది. దశాబ్దాల తర్వాత ఒకేచోట చేరిన మిత్రులంతా అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు కష్టసుఖాలు పంచుకుంటూ, కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు.
News December 28, 2025
సత్తుపల్లి – ఖమ్మం ప్రయాణం ఇక 34 నిమిషాలే: తుమ్మల

గ్రీన్‌ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే సత్తుపల్లి నుంచి ఖమ్మంకు కేవలం 34 నిమిషాల్లోనే చేరుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జనవరి తర్వాత ఈ రహదారిని ప్రారంభిస్తామని గంగారంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. సత్తుపల్లి అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే గోదావరి జలాలతో నియోజకవర్గంలోని చెరువులను నింపుతున్నట్లు పేర్కొన్నారు.
News December 28, 2025
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: అర్బన్ ఏవో

కామేపల్లి మండలం బాసిత్‌నగర్ రైతులకు సరఫరా అయిన నకిలీ విత్తనాల వ్యవహారంపై అధికారులు స్పందించారు. దీనిపై ఖమ్మం అర్బన్ ఏవో కిషోర్ వివరణ ఇస్తూ.. క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు, అధికారులు పంటను సందర్శించి నివేదిక అందజేస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా నకిలీ విత్తనాలు విక్రయించిన సంబంధిత దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.


