News September 7, 2024

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ

image

వినాయక చవితి పండగ సందర్భంగా శనివారం ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సతీసమేతంగా పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News December 18, 2025

చంద్రన్న మార్కాపురం జిల్లా.. ఫ్లెక్సీ వైరల్‌.!

image

ప్రకాశం నుంచి విడిపోతున్న మార్కాపురం జిల్లా పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. MLA కందుల నారాయణరెడ్డి జిల్లా ప్రకటన తర్వాత చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలన్నారు. దీనిని పలు సంఘాలు వ్యతిరేకించి, నల్లమల జిల్లా, కాటమరాజు జిల్లా పేర్లను ప్రతిపాదించాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రన్న మార్కాపురం జిల్లా అంటూ ఫ్లెక్సీలో ఉండడం గమనార్హం.

News December 18, 2025

టంగుటూరు మర్డర్.. మృతుని వివరాలివే.!

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడు మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన వెంకటరమణయ్యగా పోలీసులు గుర్తించారు. రమణయ్య టంగుటూరు ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య చనిపోగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.

News December 18, 2025

టంగుటూరులో వ్యక్తి మర్డర్..?

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే CI హజరతయ్య, SI నాగమల్లేశ్వరరావులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ సైతం ఒంగోలు నుంచి రానున్నట్లు సమాచారం.