News September 11, 2024
వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్, ఎస్పీ

వినాయక నిమజ్జనోత్సవాలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం మెట్పల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే వాగు ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వాగు ఒడ్డుకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ఉత్సవాలు రాత్రివేళ ఉంటాయని, పట్టణంలోని అన్ని వీధుల్లో వీధిలైట్లు ఉండాలన్నారు.
Similar News
News July 11, 2025
KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
News July 11, 2025
తిమ్మాపూర్: ‘కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’

బెజ్జంకికి చెందిన కోటారి భానుప్రసాద్(19), నరేష్‌తో కలిసి బైక్‌పై కరీంనగర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో గురువారం తెల్లవారుజామున <<17014948>>రేణికుంటలో<<>> రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సాయిబాబా గుడి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాద ఘటనపై భాను ప్రసాద్ తల్లి రేణుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢీకొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
News July 11, 2025
KNR: విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది: USFI

KNR జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న జూనియర్ కళాశాలలను తక్షణమే మూసివేయాలని USFI (యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) డిమాండ్ చేసింది. ఈ మేరకు USFI కరీంనగర్ జిల్లా కార్యదర్శి సంద గణేష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు DIEOకి గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. అక్రమంగా నడుస్తున్న ఈ కళాశాలల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, వీటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.