News March 4, 2025
వినికిడి సమస్యను సాంకేతికతతో అధిగమిద్దాం: మంత్రి

వినికిడి సమస్యను సాంకేతికతతో అధిగమిద్దామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. వరల్డ్ హియరింగ్ దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒక శబ్దాన్ని వినగల్గడం అనేది భగవంతుడు మన అందరికి ఇచ్చిన గొప్ప వరమని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సమస్యల వల్ల మన సమాజంలోనే కొంతమంది వినికిడి లోపాన్ని కల్గి ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈఎన్టీ సమస్యలను ఆరోగ్యశ్రీ లోకి తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
Similar News
News December 4, 2025
మెదక్: తొలి విడతలో 144 గ్రామాల్లో ఎన్నికలు

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 160 గ్రామ పంచాయతీల్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 1402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అవడంతో ఈరోజు ఉపసర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహించినట్లు వివరించారు. మిగిలిన 144 సర్పంచ్, 1072 వార్డులకు 11న ఎన్నికల నిర్వహిస్తున్నట్లు తెలిపారు
News December 4, 2025
తిరుమల: దర్శనాల పేరుతో మోసం చేసిన ఇద్దరు అరెస్ట్

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసిన ఇద్దరిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాప్రతినిధుల పేరుతో నకిలీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రికమండేషన్ లెటర్లు తయారుచేసి అమాయక భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నాయుడుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
News December 4, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్గూడెం చెక్పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్


