News January 10, 2025
వినియోగదారులు అపోహలు విడాలి: ప్రకాశం ఎస్.ఈ
విద్యుత్ వినియోగదారుల పిఎం సూర్య ఘర్ యోజన పై అనుమానాలు వీడాలని ప్రకాశం జిల్లా ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుందని, సబ్సిడీ బ్యాంకు లోన్ కూడా లభిస్తుందని వెల్లడించారు. తమ సిబ్బంది వినిగిదారులని కలుస్తారని తెలిపారు.
Similar News
News January 13, 2025
గుడ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై సోమవారం బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు వద్ద మోటర్ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, కారులో పయనిస్తున్న అధ్విక రాజ్ అనే పాప అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను కావలి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 13, 2025
మార్కాపురం: దారణ హత్య.. హంతకులు ఎవరంటే?
మార్కాపురం మండలం కొత్తపల్లికి చెందిన సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లతో వివాహమైంది. అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణతో తన భార్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకటనారాయణను 2005వ సం”లో వెంకటేశ్వర్లు హత్య చేసి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కాగా సుబ్బలక్ష్మమ్మ తన పద్ధతి మార్చుకోలేదనే అనుమానంతో వెంకటేశ్వర్లు తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి 4 రోజుల క్రితం భార్యను హత్య చేశాడు.
News January 13, 2025
ప్రకాశం: జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక
ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ తమిమ్ అన్సారియా ప్రకటన విడుదల చేశారు. సోమవారం భోగి సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.