News April 17, 2025

వినియోగదారులు సంస్థకు సహకరించాలి: ఎస్ఈ

image

వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ సుదర్శనం తెలిపారు. గురువారం మామడ మండలం తాండ్ర సబ్ స్టేషన్‌లో రెండు ప్రత్యేక బ్రేకర్లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలని కోరారు. డీఈ నాగరాజు, ఏఈ బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు?

image

గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు పేరు అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (LIDCAP) చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

News December 16, 2025

రూ.1,000 కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారుగా.. న్యాయమూర్తి ఆశ్చర్యం

image

TG: ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు చెల్లించట్లేదంటూ TGSPDCL గీతం యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ వర్సిటీ హైకోర్టుకు వెళ్లింది. 2008 నుంచి రూ.118 కోట్ల బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సామాన్యులు రూ.1,000 కట్టకపోతే అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారని, గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ SE హాజరుకావాలని ఆదేశించారు.

News December 16, 2025

లింగంపేట్: సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ క్లాస్‌మెట్స్

image

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి గ్రామంలో జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ మన్నే బాలయ్య, వార్డ్ మెంబర్ ఎదురుగట్ల అంజ గౌడ్ ముగ్గురూ క్లాస్‌మెట్స్ కావడం విశేషం. ఇలా తమ ముగ్గురు క్లాస్‌మెట్స్‌ని గెలిపించిన శెట్‌పల్లి గ్రామ ప్రజలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.