News April 5, 2024
వినుకొండకు ఏప్రిల్ 8న సీఎం జగన్ రాక
వినుకొండ పట్టణంలో ఏప్రిల్ 8 న జరగనున్న ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో సీఎం జగన్ పొల్గొననున్నారని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని వైసీపీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బొల్లా బ్రహ్మనాయుడు, అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రారంభమైన మేమంతా సభ తర్వాత గురజాలలో జరుగుతుందని తెలిపారు.
Similar News
News January 24, 2025
గుంటూరు: మూడు రోజులు పోలీసు కస్టడీకి తులసి బాబు
RRRను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును మూడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశించారు. నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో ఒంగోలు ఎస్పీ విచారణాధికారి. ఐదు రోజుల కస్టడీకి పిటీషన్ దాఖలు చేయగా, తులసి తరఫు న్యాయవాదులు అందుకు నిరాకరించారు. కేసు పూర్వపరాలు, వాదోపవాదాల అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించారు.
News January 23, 2025
మాచవరం: సరస్వతి భూముల వివాదం ఇదే
పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కి భూములు కేటాయించారు. వారికి కేటాయించిన భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. గత నవంబరులో ఈ వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఇందులో భాగంగా వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.
News January 23, 2025
తెనాలి: వైకుంఠపురం హుండీలో రూ.2000 నోట్లు
వైకుంఠపురం దేవస్థానంలో స్వామి వారి హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టగా రూ. 2000 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. రూ.4 లక్షలు విలువ చేసే మొత్తం 200 నోట్లను గుర్తించారు. 2023 మేలో రూ.2000 నోట్లను ఆర్బిఐ బ్యాన్ చేయగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఈ నోట్లు వాడుకలో లేవు. అయితే దేవుడి హుండీలో ఈ నోట్లు మళ్లీ ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.