News July 18, 2024
వినుకొండలో దారుణ హత్య.. కారణాలివే.!
వినుకొండ ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్న షేక్ రషీద్ (25) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రషీద్ ముళ్లమూరు బస్టాండ్‌లోని మద్యం దుకాణంలో పని ముగించుకుని బయటకు రాగానే, బయట కాపు కాసిన ఏసీ మెకానిక్ జిలాని కత్తితో రషీద్‌పై దాడి చేశాడు. ఈ సంఘటనపై పల్నాడు ఏఎస్సీ లక్ష్మీపతి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగిందని గతంలో జిలానిపై రషీద్ దాడి చేసినట్లు చెప్పారు.
Similar News
News December 1, 2024
ధాన్యం కొనుగోలుపై అపోహలు వద్దు: నాదెండ్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు వరకు ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిధిలోని ఐతానగర్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని భరోసా కల్పించారు.
News December 1, 2024
రేపు మంగళగిరిలో ప్రజా వేదిక నిర్వహణ
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో సోమవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్యాలయ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. రేపు జరిగే ప్రజా వేదికలో గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, APTDC ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి పాల్గొంటారని చెప్పారు. ఈ ప్రజా వేదికలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. అందరూ ఈ ప్రజా వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 1, 2024
పీఠాధిపతిగా చిన్న వయసు నుంచే మన్ననలు పొందారు
పల్నాటి ఉత్సవాలలో భాగంగా ప్రస్తుతం వీరాచారాన్ని చేస్తున్నది పిడుగు వంశీకులలోని పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యవారు. ఆయన తండ్రి విజయ్, తల్లి సరస్వతి. చిరుప్రాయంలోనే పల్నాటి వీరాచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక పక్క చదువుతూ తండ్రి బొగ్గరం విజయ్ నేతృత్వంలో ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందారు. గ్రామంలో నేటికి అలనాటి చారిత్రక చిహ్నాలు ఉన్నప్పటికి ఆదరించే అధికారులు కానరాక శిథిలావస్థకు చేరాయి.