News March 25, 2025
వినుకొండ: ఉద్యోగం పేరుతో భారీ మోసం

ఉద్యోగం పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటనపై బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వినుకొండకు చెందిన వెంకట్రావు బంధువు కుమారుడికి వసంతరావు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అందుకోసం వెంకట్రావు దగ్గర నుంచి రూ. 20 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. దీంతో డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని గ్రివెన్స్లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Similar News
News December 7, 2025
YCP ‘కోటి సంతకాలు’లో మార్పులు: సజ్జల

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రాష్ట్రపతి పర్యటన వల్ల 16న గవర్నర్ షెడ్యూల్ మారింది. ఆరోజుకు బదులు 17న పార్టీ చీఫ్ జగన్, నేతలు గవర్నర్ను కలుస్తారు. ఇక జిల్లాస్థాయి ర్యాలీలు 13కు బదులు 15న జరిపి అక్కడి నుంచి బయలుదేరాలి. నియోజకవర్గాల్లో నిర్ణీత 10న కార్యక్రమాలు నిర్వహించాలి’ అని చెప్పారు.
News December 7, 2025
నెల్లూరులో బస్సు డ్రైవర్పై కత్తితో దాడి

నెల్లూరులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద బస్సు డ్రైవర్, కండక్టర్పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 7, 2025
రాష్ట్రస్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం

హైదరాబాద్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి బాలురు, బాలికల ఖో ఖో ఫైనల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం సాధించాయి. బాలుర జట్టు రంగారెడ్డి జిల్లాపై, బాలికల జట్టు నల్లగొండ జిల్లాపై గెలుపొందాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా డీఐఈఓలు విద్యార్థులను, కోచ్, మేనేజర్లు, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావును అభినందించారు.


