News March 23, 2025
వినుకొండ: ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య

వినుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల వద్ద ఎక్స్ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతుడు తెలుపు నిండు చేతులు చొక్కా, ఆకుపచ్చ నైట్ ప్యాంటు ధరించినట్లు చెప్పారు. మృతుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.
Similar News
News December 6, 2025
EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.
News December 6, 2025
ఎల్లారెడ్డిపేట: విషాదం.. సౌదీలో ఆగిన గుండె

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ గుట్టపల్లి చెరువు తండాకు చెందిన వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గుగులోతు రవి అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజిట్ వీసా మీద ఆరు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేటట్లు చూడాలని KTRను బాధిత కుటుంబం వేడుకుంటోంది.
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.


