News April 6, 2025

వినుకొండ: కళాకారుల సమస్యలు పరిష్కరించండి

image

వినుకొండలోని గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో 5 మండలాల కళాకారులతో శనివారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి ర్యాలీగా నరసరావుపేటకి బయలుదేరి వెళ్లారు. కళాకారులు పడుతున్న ఇబ్బందులు, కళాధరణ లేక ఉండటానికి ఇల్లు లేక అనేక రకాల సమస్యలతో ఉన్న కళాకారులకి ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి కళాకారులు పాల్గొన్నారు. 

Similar News

News December 4, 2025

అదనపు సిబ్బందిని తీసుకోండి.. SIRపై సుప్రీంకోర్టు

image

‘SIR’ విధుల్లో ఒత్తిడితో BLOల <<18435836>>ఆత్మహత్య<<>> ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బందులు వచ్చినప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పని గంటలనూ తగ్గించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ECతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అయితే సరైన కారణంతో విధుల నుంచి మినహాయింపు కోరితే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

News December 4, 2025

ఇష్టారీతిన అనుమతులు.. ప్రైవేటుకు విక్రయిస్తున్న వైనం..!

image

ప్రభుత్వ పనుల పేరిట ఇసుక రవాణా అనుమతి పొందిన ట్రాక్టర్ల యజమానులు ఇసుకను ప్రైవేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేములవాడ జడ్పీ బాలికల హైస్కూల్ ఆవరణలో లైబ్రరీ, కంప్యూటర్ గది నిర్మాణం పనులు నిధుల కొరత కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయినప్పటికీ, 16 ట్రిప్పుల ఇసుక రవాణాకు అనుమతి పొందిన ఓ ట్రాక్టర్ యజమాని దానిని కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్‌కు విక్రయించిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్‌: ప్రజలకు ఉచిత ప్రవేశం!

image

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను పబ్లిక్‌కు చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సదస్సులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, నిపుణులతో సెషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించింది. JBS, MGBS నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా అందించనుంది.