News February 12, 2025
వినుకొండ: గుర్తు తెలియని వ్యక్తి మృతి

వినుకొండ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో అంబేడ్కర్ నగర్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని తెలిపారు.
Similar News
News March 17, 2025
ఏలూరు : బాలికపై అత్యాచారం .. కేసు

ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన పౌలు (20) అనే ఆటో డ్రైవర్‌పై రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. 15 ఏళ్ల బాలికకు ప్రేమించానని మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 17, 2025
ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు నిల్..!

ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోయారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు, ప్యాన్లు లేవన్నారు. మూత్రశాలలు సైతం కంపుకోడుతున్నాయని చెబుతున్నారు. బస్టాండ్ అవరణలో ఉన్న షాపుల వారు ఉన్న రేట్లకంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.
News March 17, 2025
అన్నమయ్య: ఒకవైపు తండ్రి మృతి.. మరో వైపు 10th పరీక్షలు

అన్నమయ్య జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. పీటీఎం మండలం గొడుగువారిపల్లెకు చెందిన వెంకటరమణ(55)కు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య వదిలేసింది. కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించేవాడు. ఆదివారం చింతకాయలు కోయడానికి చెట్టుఎక్కి కింద పడి మృతి చెందాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కాగా నేడు వెంకటరమణ కుమార్తె పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.