News November 27, 2024

వినుకొండ: టీడీపీ నేత కోడలి చీర మిస్సింగ్‌.. నోటీసులు జారీ 

image

ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్‌లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడుతూ.. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్‌లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్‌, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.  

Similar News

News December 5, 2024

పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా: అంబటి

image

పుష్ప-2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ అభిమానులు బుధవారం రాత్రి నుంచి థియేటర్ల వద్ద రచ్చ రచ్చ లేపుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమాపై స్పందించారు. ‘పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా కాదు వరల్డ్ ఫైర్’ అంటూ తన X ఖాతాలో రాసుకొచ్చారు.

News December 5, 2024

మంగళగిరిలో ఎర్రచందనం పట్టివేత 

image

మంగళగిరి మండలం కాజ టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 చక్రాల లారీలో ఎవరికి అనుమానం రాకుండా A4 పేపర్ బండిల్స్ మధ్యన సుమారు 50 దుంగలను దాచి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. చెన్నై నుంచి అస్సాం… అస్సాం నుంచి చైనా దేశానికి ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. 

News December 5, 2024

గుంటూరు: జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి కలెక్టర్ పిలుపు 

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10.30గంటలకు జిల్లాస్థాయి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, భూ సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీవోలు హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.