News August 28, 2024

వినుకొండ: డబ్బుల కోసం తమ్ముడి హత్య చేశారు

image

వినుకొండలో సొంత సోదరుడుని రోకలి బండతో కొట్టి చంపారు. సీఐ శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనాల్సా బజారుకు చెందిన సుభానీ జులై 8 నుంచి కనపడటం లేదని అతని భార్య మేహరిన్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి సోదరులను విచారించగా డబ్బులు విషయంలో గొడవ జరిగి రోకలి బండతో కొట్టి చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Similar News

News March 17, 2026

GNT: అన్‌ఎయిడెడ్ స్కూల్ టీచర్లకు డీఈఓ ప్రకటన

image

గుంటూరు జిల్లాలోని అన్‌ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు డీఈఓ కీలక ప్రకటన చేశారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు www.deognt.blogspot.inను చూడొచ్చన్నారు. దరఖాస్తు దారులకు మార్చి 22న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు గుంటూరులో సర్టిఫికెట్ల పరిశీలన, డెమో క్లాసులు ఉంటాయని అధికారులు తెలిపారు.

News March 16, 2026

గుంటూరులో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు: DEO

image

గుంటూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DEO షేక్ సలీం బాషా తెలిపారు. మొత్తం 27,699 మంది విద్యార్థుల్లో 27,123 మంది పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా నోడల్ అధికారి పార్వతి 5 కేంద్రాలు, డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి మంగళగిరిలో ఒక కేంద్రం, డీఈఓ సలీం బాషా 8 కేంద్రాలు పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 38 కేంద్రాలు, రాష్ట్ర పరిశీలకులు 12 కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.

News March 16, 2026

గుంటూరు: మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ఏదీ?

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు సంఘం నాయకులు PGRSలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు కేవలం రూ.1,600కే కొనుగోలు చేస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల రైతులు ఎకరాకు రూ.24 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులను ఆదుకోవాలన్నారు.