News February 18, 2025

వినుకొండ: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

image

వినుకొండలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టైల్స్ పనులు నిమిత్తం నాలుగు నెలల క్రితం కార్మికులు వచ్చి పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి పవన్ కుమార్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News March 22, 2025

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?

image

శీతల పానీయాల్లో మైక్రోప్టాస్టిక్‌లు ఉన్నట్లు థాయిలాండ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్యాకేజీతో సంబంధం లేకుండా మొత్తం 9 బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్‌ గుర్తించారు. ఏడాదికి ఓ వ్యక్తి సగటున 41.13 లీటర్ల కూల్‌డ్రింక్స్ తాగుతున్నట్లు గుర్తించారు. కూల్‌డ్రింక్స్ జీవక్రియ, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మైక్రోప్లాస్టిక్ శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి మరింత పరిశోధనలు చేయనున్నారు.

News March 22, 2025

ట్విటర్ ‘పిట్ట’కు భలే ధర

image

ట్విటర్ పేరు వినగానే ‘పిట్ట’ లోగోనే గుర్తుకొస్తుంది. ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత దాని పేరు, లోగోను Xగా మార్చారు. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్‌ బిల్డింగ్‌కు 12F పొడవు, 9F వెడల్పు, 254KGల బరువుతో ఉన్న పిట్ట లోగోను తొలగించారు. తాజాగా దాన్ని వేలం వేయగా 34,375 డాలర్లు(రూ.30 లక్షలు) పలికింది. 2006లో దీన్ని 15 డాలర్లతో తయారుచేయించినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.

News March 22, 2025

దిశా సాలియాన్ డెత్ కేసు: APRIL 2న విచారణ

image

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ EX మేనేజర్ దిశా సాలియాన్ డెత్ కేసులో ఆమె తండ్రి వేసిన రిట్ పిటిషన్‌ను APRIL 2న విచారిస్తామని బాంబే హైకోర్టు తెలిపింది. 2020, జూన్ 8న తన కుమార్తె మరణించిన తీరుపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశించాలని సతీశ్ సాలియాన్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. SSR మృతికీ దీనికీ సంబంధం ఉందని, అప్పటి CM ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే సాక్ష్యాలను తారుమారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!