News November 19, 2024

వినుకొండ: శివాలయంలో నూతన అర్చకుడు నియామకం

image

పల్నాడు(D) వినుకొండలోని శివాలయంలో అర్చకుడు మద్యం సేవించాడంటూ ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు పూజారికి నోటీసులు జారీ చేశారు. తాత్కాలికంగా ఆయనను విధుల నుంచి తప్పించినట్లు ఈవో హనుమంతురావు తెలిపారు.  ఆయన స్థానంలో నూతన అర్చకుడిని నియమించినట్లు చెప్పారు. అయితే తాను అనుచితంగా ప్రవర్తించలేదని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పూజారి తెలిపారు.

Similar News

News November 22, 2024

గుంటూరులో డిసెంబర్ 14న లోక్ అదాలత్  

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టు ప్రాంగణాల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి YVSBGV పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు, పోలీసులు లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, చెక్ బౌన్స్ కేసులు రాజీ చేసుకోవాలని చెప్పారు. 

News November 21, 2024

గుంటూరు: బోరుగడ్డ పిటిషన్‌ను మూడోసారి డిస్మిస్ చేసిన కోర్ట్

image

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌‌‌కు పలు కేసులపై రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. బోరుగడ్డ అనిల్ కేసులో అరండల్ పేట పోలీసులు సాక్ష్యాలు కోర్టు ముందు హాజరు పరిచారు. పోలీసు వారు ఇచ్చిన సాక్ష్యాల మేరకు కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. బెయిల్ పొందడానికి బోరుగడ్డ చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని గుంటూరు పోలీసులు తెలిపారు.

News November 21, 2024

గుంటూరు జిల్లా ప్రజలకు ఎస్పీ ముఖ్య గమనిక

image

ఎవరైనా సాధారణ (లేదా) ఆన్‌లైన్ యాప్స్(Whatsapp, Telegram, Skype) ద్వారా కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటే భయపడవద్దని ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. డిజిటల్ అరెస్టు పట్ల అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్లైన్ యాప్స్ ద్వారా నకిలీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.