News August 13, 2024

వినుకొండ: 250 వంటకాలతో కొత్త అల్లుడికి విందు

image

ఇంటికి వచ్చిన ఓ అల్లుడికి అత్తాగారి కుటుంబం ఘన స్వాగతం పలికింది. అన్ని రకాల వంటలు చూసిన ఆ అల్లుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆషాఢమాసం వెళ్లి శ్రావణమాసం రావడంతో నూతన వధూవరులు అత్తగారి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో అల్లుడికి స్వాగతం పలుకుతూ భారీ వంటలతో విందు పెట్టారు. వినుకొండలోని కొత్తపేట స్టేట్ బ్యాంకు లైన్‌లో నివాసం ఉన్న తాతా రమేశ్ అల్లుడు రాకతో 250 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.

Similar News

News October 18, 2025

గుంటూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడులు

image

గుంటూరు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం శనివారం దాడులు నిర్వహించింది. పాత గుంటూరు PS పరిధిలో పేకాట ఆడుతున్న 10మందిని అదుపులోకి తీసుకుని, 10 సెల్ ఫోన్లు, ₹25,500 నగదు, 4 బైకులను సీజ్ చేశారు. అలాగే, అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేటలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్మూలించడమే టాస్క్ ఫోర్స్ లక్ష్యమని ఎస్పీ అన్నారు.

News October 18, 2025

సూర్యఘర్ పథకం వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. SC, STలకు ఉచితంగా సోలార్ యూనిట్లు ఏర్పాటు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

News October 18, 2025

గుంటూరు: సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం తెలిపారు. దీపావళి సందర్భంగా సెలవు దినం కావడంతో పీజీఆర్‌ఎస్ జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.