News December 31, 2024

వినూత్న ఆలోచనలకు ఎమ్మెల్యే విజయశ్రీ శ్రీకారం

image

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తన దగ్గరకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు బొకేలు, పూలమాలలు తీసుకురావద్దని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రగ్గులు, అంగన్వాడీ పిల్లలకు పనికొచ్చే ప్లేట్లు, గ్లాసులు, పేద విద్యార్థులకు ఉపయోగపడే బుక్స్, పెన్నులు తీసుకురావాలని ఆమె కోరారు.

Similar News

News November 28, 2025

నెల్లూరు మేయర్‌గా దేవరకొండ సుజాత..?

image

నెల్లూరు నగర మేయర్‌గా దేవరకొండ సుజాతను ఎంపిక చేసేందుకు టీడీపీ సిద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15లోగా ప్రస్తుత మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అనేక అంశాలను పరిశీలించి సుజాత పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈమె పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

News November 28, 2025

నెల్లూరు జిల్లాలో మార్పులు.. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా.?

image

జిల్లాలో 5 మండలాల డివిజన్ మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కందుకూరు డివిజన్లో ఉన్న కొండాపురం, వరికుంటపాడు మండలాలను కావలి డివిజన్‌లో కలిపేలా నెల్లూరు డివిజన్‌లో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లా గూడూర్ డివిజన్‌లో కలిపేలా నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తెలుపాలని అధికారులు సూచించారు.

News November 28, 2025

అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి: జేసీ

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 29, 30, డిసెంబర్ 1 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే షెల్టర్లను గుర్తించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.