News February 9, 2025
విన్నర్‌గా పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు

గుంటూరులో నిర్వహించిన పారా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు శనివారం విన్నర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ముఖ్య అతిథి 2024 పారా ఒలింపిక్ బ్రౌంగ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్ రుబీన ఫ్రాన్సిస్ చేతుల మీదగా విన్నర్ ట్రోఫీని ఈ జట్టుకు అందజేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ కె.శ్రీను, వైస్ కెప్టెన్ జి.సంతోష్‌లను, క్రికెట్ జట్టును పలువురు అభినందిస్తున్నారు.
Similar News
News December 9, 2025
కోనసీమ: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446160, సీఐలు 9440446161, 8332971041, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కాగా నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం. ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు.
News December 9, 2025
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)వరంగల్‌లో 3పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, B.Sc( Food Tech), MSc( Food Tech), BA/BSc(సైకాలజీ)లేదా MA/MSc(సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PWBDలకు రూ.300. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/
News December 9, 2025
సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. 1983 ఏప్రిల్‌లో ఇండియన్ సిటిజన్‌షిప్ రావడానికి మూడేళ్ల ముందే ఎలక్టోరల్ రోల్‌లో పేరు నమోదైనట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2026, జనవరి 6వ తేదీన ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోనె తెలిపారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.


