News November 12, 2024
‘విప్’లుగా గణబాబు, వేపాడ చిరంజీవి

శాసనసభ విప్‌గా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబును ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో విప్‌గా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గణబాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. 2017 నుంచి 2019 వరకు విప్‌గా పనిచేశారు. వేపాడ చిరంజీవి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో గెలుపొందారు.
Similar News
News November 14, 2025
మూడేళ్లలో విశాఖలో లూలూ మాల్

మూడేళ్లలో విశాఖలో ‘లూలూ’ మాల్‌ను పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ తెలిపారు. CII సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 2018లో మాల్‌కు శంకుస్థాపన చేశామన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పలు కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
News November 14, 2025
ఆల్పాహార విందులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్.. సీఎం చంద్రబాబు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు. వీరితో పాటుగవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఉన్నారు.
News November 14, 2025
విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాలో రాధాకృష్ణన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణానికి ఉపరాష్ట్రపతి చేరుకొని సదస్సును ప్రారంభించనున్నారు.


