News January 18, 2026

విభజన బ్లూప్రింట్: పోలీస్ కమిషనరేట్లే ప్రామాణికం?

image

మెగా బల్దియాను 3 కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి) విభజించే ప్రతిపాదనపై ప్రభుత్వం రహస్యంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణనే దీనికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. పోలీస్ సరిహద్దుల ప్రకారమే కొత్త కార్పొరేషన్ల పరిధి ఉంటే పాలనాపరమైన ఇబ్బందులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. <<18882495>>300 డివిజన్ల<<>> డేటా అందుబాటులో ఉండటంతో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకం కలగదు.

Similar News

News February 18, 2026

HYD: రేపటి నుంచి నైట్ అంతా ఓపెన్!

image

తెలంగాణలో రంజాన్ సందర్భంగా షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌లకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు మినహాయింపులు అమలులో ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం 5 గంటల వరకు(నైట్ బజార్) షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇక చార్మినార్‌లో రేపటి నుంచి నైట్ బజార్‌ మొదలుకానుంది. ఇక 24/7 నగరవాసుల రాకపోకలతో పాతబస్తీ కళకళలాడనుంది.

News February 18, 2026

GHMCలో రోజుకు 7,800 టన్నుల చెత్త సేకరణ

image

GHMC పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై కమిషనర్ కర్ణన్ సమీక్షించారు. రోజూ నగరంలోనే దాదాపు 7,800 టన్నుల చెత్తను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నాయి. అదే సమయంలో 2,650 స్వయం సహాయక సంఘాలకు చెందిన 18,557 మంది కార్మికులు క్షేత్రస్థాయిలో నిరంతరం పని చేస్తున్నారని కమిషనర్ వివరించారు.

News February 18, 2026

జూపార్క్: ఇండియాలోనే కాస్ట్ లీ టికెట్ ధర!

image

జూ పార్కులో సాధారణ ఎంట్రీ ఫీజు కేవలం రూ.100 (పెద్దలకు) మాత్రమే ఉంది. కానీ, <<19174320>>ఈ అండర్<<>> వాటర్ టన్నెల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. గుజరాత్ సైన్స్ సిటీలోని ఇలాంటి టన్నెల్ అక్వేరియం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 పైన ఉంది. హైదరాబాద్‌లో దీనిని మరింత అత్యాధునికంగా నిర్మిస్తున్నందున నిర్వహణ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధర రూ. 300 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.