News December 4, 2024
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చర్యలు: కలెక్టర్

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 31 వేల 69 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.18.96 కోట్ల పెన్షన్‌ను అందచేస్తున్నామని తెలిపారు. అవసరం ఉన్న వారికి ట్రై సైకిళ్లను, హియరింగ్ ఎయిడ్స్, తదితర పరికరాలను కూడా అందచేస్తున్నామన్నారు.
Similar News
News July 6, 2025
కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా లక్ష్మీ నరసింహ యాదవ్

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ స్థానంలో డీసీసీగా లక్ష్మీ నరసింహ యాదవ్‌ను నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

డిజిటల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సప్, స్కైప్‌ల ద్వారా వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సైబర్ నేరం జరిగితే https://cybercrime.gov.in/కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.