News July 4, 2024
విలీన మండలాల సాధన కోసం దీక్ష చేయండి: డిప్యూటీ భట్టి

బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఏడు మండలాల సాధన కోసం దీక్ష చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాలు విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఆ మండలాలను విలీనం చేసిందని విమర్శించారు. పార్లమెంటులో బీజీపీ – బీఆర్ఎస్ ఒప్పంద మేరకే మండలాల విలీనం జరిగిందని చెప్పారు.
Similar News
News September 16, 2025
ఖమ్మం: ఆమె ఆరోగ్యమే లక్ష్యం

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి OCT 2 వరకు మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో 26 PHCలు, 4 UPHCలు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు 10 క్యాంపుల చొప్పున 12రోజుల్లో 120 క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయనున్నారు.
News September 16, 2025
హైవేల వల్ల భూములు విలువ పెరుగుతుంది: కలెక్టర్

గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్లతో కలిసి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణ సమస్యపై రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు అన్యాయం చేయాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైవే రావడం వల్ల భూముల విలువ పెరుగుతుందన్నారు.
News September 15, 2025
‘గ్రామపాలనాధికారులు మెరుగైన సేవలు అందించాలి’

ఖమ్మం: గ్రామపాలనాధికారులు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్ ఇచ్చామన్నారు.