News February 13, 2025
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్: ఆలూరు సాంబ

విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సీనియర్ నేత ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని ప్రజలు నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.
Similar News
News March 28, 2025
నీ మొగుడి అలవాట్లే నీకు వచ్చాయి: తోపుదుర్తి

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో పరిటాల కుటుంబం ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ‘నీ మొగుడి అలవాట్లే నీకు, నీ కొడుకులకు వచ్చాయి. మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. టీడీపీకి కేవలం ఒక ఎంపీటీసీ స్థానం ఉన్నా దౌర్జన్యంతో ఎంపీపీ పీఠం చేజిక్కుంచుకోవాలని చూస్తున్నారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
News March 28, 2025
తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!

తండ్రి మరణంతో దుఃఖాన్ని దిగమింగుకుని పది పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఉరవకొండ మం. రాకెట్లకు చెందిన రఘు(48) కూడేరు మండలం గొట్కూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రక్షిత పది పరీక్షలు రాస్తోంది. తన పెద్ద కుమార్తెను కాలేజీలో విడిచిపెట్టి తిరిగి బైక్‌పై వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. తండ్రి లేడన్న బాధను దిగమింగుకుని చిన్నకూతురు పరీక్ష రాసింది.
News March 28, 2025
వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పెన్నోబులేసు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా మాల్యావంతం పెన్నోబులేసును నియమించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.