News December 21, 2024

వివాదం కోరుకోవడం లేదంటూనే బన్నీ విమర్శలు

image

ప్రభుత్వంతో వివాదం కోరుకోవడం లేదంటూనే TG CMకు బన్నీ కౌంటర్ ఇచ్చారు. పర్మిషన్ లేకున్నా రోడ్ షో చేశారని అసెంబ్లీలో రేవంత్ అంటే, రావద్దని పోలీసులు అప్పుడే చెబితే వెనక్కి వెళ్లేవాన్నని బన్నీ చెప్పారు. ఇక అది రోడ్ షో కాదని, కార్‌పై నుంచి చేయి ఊపానన్నారు. అటు ప్రమాదం గురించి చెప్పి, వెళ్లాలని పోలిస్ హెచ్చరించినా మళ్లీ చేతులూపుతూ వెళ్లారని CM అన్నారు. అయితే తనకు వారు ఏమీ చెప్పలేదని బన్నీ పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

రేగుపాలెం: యాక్సిడెంట్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తుని నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ బోల్తా పడడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 20, 2025

మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?

image

పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ మన దేశంలో మరో దాడికి కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి స్క్వాడ్‌ను సిద్ధం చేస్తోందని హెచ్చరించాయి. ‘ఇందుకోసం జైషే నాయకులు డిజిటల్ మార్గాల్లో నిధుల సేకరణకు పిలుపునిచ్చారు. ₹6,400 చొప్పున ఇవ్వాలని అడుగుతున్నారు. వారు మహిళల నేతృత్వంలో దాడికి కుట్ర పన్నుతున్నారు’ అని తెలిపాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో జైషే హస్తం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

News November 20, 2025

బోర్డులను “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చారు: సంజయ్‌

image

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.