News January 1, 2025
వివాహిత హత్య కేసులో నలుగురు అరెస్ట్
వివాహిత షేక్ మల్లిక(29) హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వివరాల ప్రకారం.. పెదకాకాని(M) నంబూరికి చెందిన మల్లికకు అక్బర్‌తో 15ఏళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత ఆమె భర్తను, పిల్లలను వదిలేసి ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెహమాన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మరో యువకుడితో కూడా సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో రెహమాన్ ఆమెను చంపించాడు.
Similar News
News January 7, 2025
గుంటూరు: మద్యం జోలికి వెళ్లని గ్రామమది..
పొన్నూరు(M) వెల్లలూరు ఒకనాడు ఫ్యాక్షనిజంతో అట్టుడికేది. అలాంటి గ్రామం నేడు మహనీయుడు విశ్రాంత న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు ఆశయాలకు అనుగుణంగా మద్యానికి దూరంగా ఉంటూ గ్రామస్వరాజ్యం వైపు అడుగులు వేస్తోంది. 15ఏళ్ల క్రితం వరకు గ్రామంలో స్వల్ప కారణాలతో చంపుకునే వరకు వెళ్లేవారు. ఇది చూసి చలించిన లక్ష్మణరావు గ్రామ ప్రజలతో సమావేశమై మద్యపాన నిషేధానికి నాంది పలికారు. ఆనాటి నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు లేవు.
News January 7, 2025
లోకేశ్ సమక్షంలో సుజ్లాన్-ఏపీఎస్ఎస్డీసీ అవగాహన ఒప్పందం
ఏపిలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాలు ఎంఓయు చేసుకున్నారు. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసెన్సింగ్ వంటి కీలక రంగాల్లో 12వేలమందికి శిక్షణ ఇస్తారు.
News January 7, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గుంటూరు DMHO
చైనాను ఒణికిస్తున్న hMPV వైరస్ కేసులు మన దేశంలో నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు DMHO డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలన్నారు. పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.