News April 17, 2024

వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఎంఆర్ఐ), బీఈడీ (ఎల్డీ), బీఈడీ (హెచ్ఐ), బీఈడీ (ఏఎస్ఐ) తదితర కోర్సుల సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

సైబరాబాద్‌ కమిషనరేట్‌కు కొత్తగా 2 పోలీస్ కేనైన్‌లు

image

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్‌లు సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.

News February 25, 2026

HYDలో ఇలా చేస్తే రూ.2లక్షల FINE!

image

నిర్మాణ వ్యర్థాల పారబోతపై GHMC పకడ్బందీగా వ్యవహరించనుంది. నాలాలు, చెరువుల్లో వ్యర్థాలు పారబోస్తే రూ.2 లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు డంప్ చేసినా ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. బస్‌భవన్, VST పాత ఆఫీసు ఎదురు గల్లీలో నిర్మాణ వ్యర్థాలతో రోడ్డు మూసుకుపోవడం గమనార్హం. ఇలాంటివి రిపీట్ కావొద్దంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.

News February 25, 2026

HYD: బుక్స్‌ను గౌరవిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం!

image

పరీక్షలు ముగిసిన తర్వాత పుస్తకాలను చింపి రోడ్లపై వేయకుండా, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని HYDలోని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుస్తకాలు జ్ఞానానికి ప్రతీకలని, సరస్వతి దేవతతో సమామానంగా కొలిచే వాటిని అగౌరపరచొద్దని, అవసరమైనవారికి అందించాలని గుర్తు చేస్తున్నారు. రోడ్లపై పేపర్లు వేస్తే పారిశుద్ధ్య కార్మికులపై భారం పడుతుందని, నగరాన్ని నీట్‌గా ఉంచడంలో అందరూ సహకరించాలన్నారు.