News August 8, 2024

వివేక హత్య కేసుపై.. కడప SPని కలిసిన YS సునిత

image

కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును వివేకా కుమార్తె సునీతరెడ్డి బుధవారం కలిశారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు. గత ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో సీబీఐకి, తమకు పోలీసులు సహకరించలేదని, స్థానిక పోలీసులు నిందితులకు అండగా నిలిచారన్నారు. ఈ కేసులో తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేలా వ్యవహరించారని అన్నారు.

Similar News

News November 24, 2025

ప్రొద్దుటూరు: బంగారు వ్యాపారి బాధితులు ఎందరో..?

image

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి తనిగంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. వ్యాపారంలో మోసం చేసి తమను బయటికి గెంటేశారని మరదలు పద్మజ ఫిర్యాదు చేశారు. HYD హేమంత్ శర్మ, మార్వాడి షమీర్, JMD సంధ్య, BDVL శ్రావణి, లేఖ ఇలా ఎందరో తమకు బంగారం బాకీ ఉన్నాడంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చట్ట విరుద్ధంగా స్కీం, చీటీల వ్యాపారంలో మోసం చేశాడంటూ బాధితులు వాపోతున్నారు.

News November 24, 2025

రేపు పులివెందులలో జగన్ పర్యటన

image

మాజీ సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన ఒక వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి అరటి తోటలను సందర్శించి, లింగాల మాజీ సర్పంచి మృతి పట్ల కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత వేల్పులలో స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు.

News November 24, 2025

ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం: కడప కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమంను అమలు చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వహించేందుకు తగు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.