News February 18, 2025

విశాఖకు చేరుకున్న ఎమ్మెల్సీ బ్యాలెట్ ప‌త్రాలు

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక‌ల‌ బ్యాలెట్ ప‌త్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓట‌ర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్య‌ర్థుల ఫోటోలు, ఇత‌ర‌ వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ల‌ను స్థానిక‌ అధికారులు ఇప్ప‌టికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ ప‌త్రాల‌ను క‌ర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.

Similar News

News March 12, 2025

విశాఖలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉపాధి

image

స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి, శిక్షణ కల్పిస్తున్నట్లు సీఈవో ఇంతియాజ్ ఆర్షేడ్ బుధవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 15వ తేదీలోపు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సముదాయంలో ఉన్న ఆఫీసులో సంప్రదించాలని కోరారు. ఐటిఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

News March 12, 2025

గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సాయం: కలెక్టర్

image

విశాఖ జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ వెల్లడించారు. ఇళ్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు సాయం అందిస్తామన్నారు. యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

News March 12, 2025

కార్య‌క్ర‌మాల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి మూడో శ‌నివారం చేప‌డుతున్న‌ స్వ‌చ్ఛ‌తా హీ సేవా కార్య‌క్ర‌మాలపై చర్చించారు. నిర్వ‌హ‌ణపై బుధ‌వారం ఉద‌యం త‌న ఛాంబ‌ర్ నుంచి నిర్వ‌హించిన‌ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

error: Content is protected !!