News February 18, 2025
విశాఖకు చేరుకున్న ఎమ్మెల్సీ బ్యాలెట్ పత్రాలు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బ్యాలెట్ పత్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫోటోలు, ఇతర వివరాలతో కూడిన నివేదికలను స్థానిక అధికారులు ఇప్పటికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.
Similar News
News April 10, 2026
రేపు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 10:30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని నగరంలోకి వెళ్తారు. 11:30 నుంచి కలెక్టరేట్‌లో సింహాచలం చందనోత్సవంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా చేస్తారు. సాయంత్రం 6గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి గన్నవరం వెళ్తారు.
News April 10, 2026
బెట్టింగ్ యాప్ ప్రమోట్.. విశాఖలో ఇద్దరి అరెస్ట్

విశాఖలోని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఓ కళాశాల ఫుట్బాల్ కోచ్ గణేశ్‌తో పాటు అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మధురవాడ భగవాన్ దాస్ కాలనీ ప్రాంతానికి చెందిన వారే. విశాలాక్షి నగర్‌లో యువకుడ్ని క్రికెట్ ప్రిడిక్షన్ అంటూ నమ్మించి బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించారు. వీరి మాటలు నమ్మిన యువకుడు రూ.12.50 లక్షలు పోగొట్టుకున్నాడు.
News April 9, 2026
విశాఖ: ఇరాన్ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన కలెక్టర్

యుద్ధ నేపథ్యంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ ఆర్థిక సాయం కోరిన ఇరాన్ విద్యార్థులకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా సంజీవని నిధి నుంచి రూ.50 వేలు విలువ గల చెక్కును, కనకమహాలక్ష్మి దేవస్థానం సమకూర్చిన రూ.50 వేలు నగదును కలెక్టర్ తన ఛాంబర్లో గురువారం అందించారు. ఏయూలో ఫార్మసీ కోర్సు చదువుతున్న జినాబ్, సోల్మాజ్ బుధవారం వినతి అందజేశారు.


