News October 16, 2024
విశాఖకు తలమానికంగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్: MP
విశాఖపట్నానికి తలమానికంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలవబోతోందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. భోగాపురంలో విమానాశ్రయం వద్ద GMR సంస్థ ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే 50ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేయడానికి అవసరమైన మార్గాల అభివృద్ధిపై చర్చించామని చెప్పారు.
Similar News
News November 10, 2024
కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ రద్దు: విజయనగరం కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లా ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News November 10, 2024
VZM: పంచారామ క్షేత్రాలకు ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు
కార్తీక మాసం పురష్కరించుకుని భక్తులు ఒకే రోజు ఐదు పంచారామ క్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు విజయనగరం ఆర్టీసీ డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వచ్చేవారం వెళ్లాలనుకునేవారు తమను సంప్రదించాలని కోరారు.
News November 10, 2024
VZM: రెండో జాబితాలోనూ కిమిడికి దక్కని చోటు
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో జాబితాలోనూ విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు చోటు దక్కలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కష్టపడ్డారు. 2024 ఎన్నికల్లో టికెట్ట్ దక్కకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో కిమిడి అభిమానులు నిరాశ చెందుతున్నారు.