News July 16, 2024
విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారు: సీఎం చంద్రబాబు

YCP నాయకులు విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారని CM చంద్రబాబు ఆరోపించారు. ‘రామానాయుడు స్టుడియో భూములలో వాటా కొట్టేయాలని చూశారు. ఓల్డేజ్ హోమ్‌కోసం ఇచ్చిన హయగ్రీవ భూములను మాజీ ఎంపీ ఎంవీవీ దోచుకోవాలని చూశారు. తన సంస్థకు 10.57 ఎకరాలు కేటాయించి, ఆ భూమిలో లబ్ధిదారులకు 0.96 శాతం వాటా ఇచ్చారు. ఆయన కంపెనీకి రూ.65 కోట్ల విలువ చేసే TDR బాండ్లను జారీ చేసి కుంభకోణానికి పాల్పడ్డారు’ అని చెప్పారు.
Similar News
News February 26, 2026
FLNAT పరీక్షకు హాజరుకావాలి: కలెక్టర్

విశాఖలో ఫిబ్రవరి 28న వయోజన విద్యార్థులకు ప్రీ-ఫైనల్ FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉల్లాస్, అక్షరాంధ్ర పథకాల కింద 15 ఏళ్లు పైబడిన వారికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 26, 2026
రుషికొండ: ప్రమాదవశాత్తు సముద్రంలో పడి యువకుడి మృతి

రుషికొండ సమీపాన బేపార్క్ వద్ద ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన స్వప్నిల్ చౌహాన్ (25) స్నేహితులతో కలిసి విశాఖ వచ్చాడు. గురువారం మధ్యాహ్నం బీచ్ వద్ద ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 26, 2026
విశాఖ :రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.05 కోట్లు అందజేత

రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్&రన్‌లో చనిపోయిన ఎలమంచిలి రాజు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, దువ్వాడకు చెందిన అను, తరిణి లక్ష్మి, మెంటాడకు చెందిన సురేశ్ యాక్సిడెంట్‌లో గాయపడడంతో వారి ఖాతాలో రూ.50వేలు చొప్పున జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో హిట్ & రన్ కేసుల్లో 129 మంది బాధితులకు మొత్తం రూ.1.05 కోట్లు అందించామన్నారు.


