News July 22, 2024
విశాఖపట్నం ఉక్కుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం..!

విశాఖ ఉక్కు కర్మాగారంలో ముడిసరకు కొరతను నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. ఉక్కు కర్మాగారానికి అవసరమైన గర్భాంలోని మాంగనీసు, సరిపల్లిలోని ఇసుక గనుల లీజుపై విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాసరావు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సీఎం స్పందిస్తూ సత్వరమే లీజుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందించారు.
Similar News
News October 16, 2025
విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్ జంప్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.
News October 16, 2025
విశాఖలో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే.. నిషేధం ఎక్కడా?

GVMC పరిధిలో పాలిథిన్ వినియోగం ఆగడం లేదు. ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించినా.. అమలు మాత్రం జరగడం లేదు. మార్కెట్లు, కిరాణా షాపులు, కూరగాయల సంతలు ఇలా ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లు సులభంగా దొరుకుతున్నాయి. GVMC అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేధం కేవలం ప్రకటనలకే అంకితమైందని పలువురు విమర్శిస్తున్నారు. కాలుష్యం పెరిగి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోతున్నా చర్యలు లేవని మండిపడుతున్నారు.
News October 16, 2025
వందేళ్ల ప్రస్థానం: ఆంధ్రా వర్సిటీ వైభవం

ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయూ) ఒక విజ్ఞాన ఖని. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో నాణ్యమైన విద్యను ఏయూ అందిస్తోంది. మెరైన్, బయాలజీ వంటి ప్రత్యేక కోర్సులకు నిలయం. వెంకయ్య నాయుడు, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహులు ఇక్కడి పూర్వ విద్యార్థులే. శతాబ్ద కాలంగా ఈ విజ్ఞాన ఖని బాధ్యతగల పౌరులను, నాయకులను తీర్చిదిద్దుతూ ఆంధ్రుల గర్వకారణంగా నిలుస్తోంది.