News March 7, 2025
విశాఖపట్నం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. విశాఖ ప్రజలు ఎక్కువగా అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అనకాపల్లిలో వివిధ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం వెళ్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా అనకాపల్లి వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ కామెంట్.
Similar News
News March 10, 2025
విశాఖలో రౌడీ షీటర్స్‌కు కౌన్సెలింగ్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా SI సునీత ఆదివారం PMపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురు రౌడీ షీటర్స్‌ను సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News March 9, 2025
విశాఖ: రేపటి నుంచి యథావిధిగా పీజీఆర్ఎస్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వినతుల స్వీకరణ కార్యక్రమం 10వ తేదీ నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని వారాల నుంచి రద్దైన సంగతి తెలిసిందే. కోడ్ ముగిసిన క్రమంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 9, 2025
ద్వారకానగర్‌లో యువతి ఆత్మహత్య

ద్వారకానగర్‌లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.