News June 23, 2024
విశాఖపట్నం: మూడు జిల్లాల రెవెన్యూ కమిటీ తీర్మానం ఏర్పాటు

విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల రెవెన్యూ కమిటీ తీర్మానం రాష్ట్ర అధ్యక్షుడు కోన.ఆంజనేయ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్రసంఘం & APJAC కలిసి పనిచేయుటకు తీర్మానించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. వీఆర్వోల సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. మూడు జిల్లాల VROల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News October 31, 2025
విశాఖ: బెట్టింగ్ యాప్.. మరో ఇద్దరి అరెస్ట్

బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్లు నడుపుతున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.
News October 31, 2025
గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారులు పూర్తి చేయాలి: VMRDA ఛైర్మన్

భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారుల పనులను గడువులోగా పూర్తి చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్లోని 7 రహదారుల పురోగతిని ప్రతి 15 రోజులకు సమీక్షించనున్నట్లు తెలిపారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్, వుడా పార్క్లో స్కేట్ బోర్డ్ పనులు కూడా సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.
News October 30, 2025
విశాఖ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం రవాణా శాఖ అధికారులు విశాఖలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 36 వాహనాలను తనిఖీ చేశారు. రహదారి నియమాలు పాటించకుండ, పర్మిట్ నియమాలను అతిక్రమించి తిరుగుతున్న ఒక బస్సుపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో టాక్స్, పెనాల్టీ రూపేణా 2,45,000 వసులు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.


