News July 12, 2024
విశాఖపట్నం రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి

విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్గా గోపీనాథ్ జెట్టి నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖ రేంజ్ డీఐజీగా ఉన్న విశాల్ గున్నీ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2008 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన గోపీనాథ్ జెట్టి రెండు మూడు రోజులలో డీఐజీగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News October 14, 2025
జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపులను మూసివేయండి: కలెక్టర్

సారా, అనధికార మద్యం రహిత జిల్లాగా విజయనగరం ఉండాలని జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ఎస్పీ దామోదర్ తో కలిసి ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు గట్టి నిఘా ఉంచాలన్నారు. ప్రభుత్వమే అక్రమ మద్యం, బెల్ట్ షాప్ లు ఉండకూడదని చెప్పిన తర్వాత ఇక ఆలోచించేది లేదని, ఎవ్వరిపై నైనా కేసులు పెట్టే తక్షణమే బెల్ట్ షాప్ లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 14, 2025
VZM: ‘జిల్లా వ్యాప్తంగా 557 కేసులు’

శృంగవరపుకోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ అధికారి బి.మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 557 కేసులు నమోదు చేసి, రూ.34.12 లక్షల జరిమానా, రూ.24.12 లక్షల రాజీ రుసుం వసూలు చేసినట్లు చెప్పారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
News October 14, 2025
విజయనగరం: విధుల్లోకి చేరిన నూతన ఉపాధ్యాయులు

డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు విధుల్లో చేరడంతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ఈ నియామకాలతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీతో జిల్లాలోని 34 మండలాల్లో అన్ని మేనేజ్మెంట్లో 578 మంది కొత్త ఉపాధ్యాయలు పోస్టింగ్ పొందారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. వీరంతా సోమవారం విధులకు హాజరయ్యారు.