News July 12, 2024
విశాఖపట్నం రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి

విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్‌గా గోపీనాథ్ జెట్టి నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖ రేంజ్ డీఐజీగా ఉన్న విశాల్ గున్నీ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గోపీనాథ్ జెట్టి రెండు మూడు రోజులలో డీఐజీగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News February 9, 2025
VZM: మద్యం షాపుల లాటరీ వాయిదా

ఈనెల 10న విజయనగరంలో జరగాల్సిన కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి బి.శ్రీ నాథుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లాటరీ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతులు వచ్చిన వెంటనే లాటరీ తేదీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
News February 9, 2025
చీపురుపల్లి అమ్మవారి జాతరకు ముహూర్తపురాట

చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పూజించే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ముహూర్తపురాట వేశారు. ఈవో మాట్లాడుతూ.. మార్చి నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
News February 9, 2025
VZM: ‘అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించొద్దు’

విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సుతో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని, అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్ట వ్యతిరేకంగా పశువుల వధించడం, రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.