News February 22, 2025

విశాఖలోని 16 సెంటర్లలో గ్రూప్-2 పరీక్ష: జేసీ

image

విశాఖ జిల్లాలో 16 ఎగ్జామ్స్ సెంటర్లలో రేపు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనునట్లు జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ -2 పరీక్ష ఉండనుందన్నారు. పరీక్షా సమయానికి 15 నిమిషాలు ముందుగా అభ్యర్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో 11,029 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

Similar News

News February 23, 2025

విశాఖలో కేంద్ర బడ్జెట్‌పై సమీక్ష 

image

విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2025-26పై ఆదివారం మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని, విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో రైతులకు పెద్ద పీట వేశారన్నారు. MLA విష్ణు కుమార్ రాజు ఉన్నారు.

News February 23, 2025

విశాఖ: లోకల్‌బాయ్ నానికి రిమాండ్..!

image

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై అందిన ఫిర్యాదుల మేరకు అరెస్టు చేసినట్లు ఆదివారం ధ్రువీకరించారు. మెజిస్ట్రేట్ ముందు నానిని హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన మరికొందరిని గుర్తించామని.. వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.

News February 23, 2025

ప్రజల పక్షాన నిలుస్తాం: కన్నబాబు

image

వైసీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వెల్లడించారు. ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. తాను నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

error: Content is protected !!