News August 11, 2024
విశాఖలో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి

విశాఖలో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా నిలిచింది. కూటమి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను ఈనెల 15 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు శిథిలమైన భవనాలను పునరుద్ధరించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడంతో కోడ్ కారణంగా ఈనెల 15న జిల్లాలో అన్న క్యాంటీన్లను ప్రారంభించడం లేదు. సెప్టెంబరు 6 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఆ తర్వాతే క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి.
Similar News
News December 17, 2025
విశాఖ: హోంగార్డు టు సివిల్ పోలీస్

లక్ష్యాన్ని సాధించాలనే దృక్పథం ఉండాలే తప్ప ఏదైనా సాధించవచ్చు అని విశాఖకి చెందిన హోంగార్డు నిరూపించాడు. బాలాజీ 40 ఏళ్ల వయసులో హోంగార్డుగా ఐటీ కోర్లో పని చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి సిటీ సివిల్ పోలీస్గా ఎంపికయ్యాడు. యువతతో అన్ని విభాగాల్లోనూ పోటీపడుతూ ఉత్తమప్రతిభ చూపిస్తూ 6 నిమిషాల్లో 1,600 మీటర్లు పరిగెత్తి శభాష్ అనిపించుకున్నాడు. మంగళగిరిలో నిన్న నియామక పత్రం అందుకున్నాడు.
News December 17, 2025
విశాఖలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ

విశాఖ నుంచి విమానయాన ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడి నుంచి రోజుకు 28 దేశీయ విమాన సర్వీసులు.. వారానికి 2 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సగటున 8,500-9,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు కలవు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టిటివీ అవసరం ఎంతైనా ఉంది.
News December 17, 2025
విశాఖలో 102 మంది ఎస్ల బదిలీ

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబత్రబాగి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్, క్రైమ్, శాంతి భద్రతల విభాగాలకు చెందిన 102 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. మంగళవారం ఉదయం ఐదుగురు ఎస్ఐలను రేంజ్కు అప్పగించగా కొద్ది గంటల్లోనే భారీగా బదిలీలు జరిగాయి. వీరిలో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారికి, ఇతర పరిపాలన కారణాలతో స్థానచలనం కల్పించారు.


